News September 6, 2024
వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: సీఈవో

TG: జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, OCT 29న ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. NOV 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జనవరి 6న ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,33,27,304 మంది ఓటర్లున్నారని చెప్పారు.
Similar News
News December 4, 2025
వాస్తును నమ్మవచ్చా?

వాస్తుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు దీన్ని నిజమని నమ్ముతారు. మరికొందరు మూఢనమ్మకమని అభిప్రాయపడతారు. అయితే వాస్తు అనేది ఓ శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఇది కేవలం ఓ నమ్మకం కాదు. జీవన మనుగడకు అవసరమైన పంచభూతాలను ఈ శాస్త్రం సమన్వయం చేస్తుంది. నివాసయోగ్యత కోసం మనం నివసించే ప్రదేశాలలో ఈ పంచభూతాల సమతుల్యత కోసం వాస్తును పాటించాలి’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 4, 2025
హార్టికల్చర్ హబ్‌కి కేంద్రం ₹40వేల కోట్లు: CBN

AP: హార్టికల్చర్ హబ్‌గా 9 జిల్లాలను తయారుచేస్తున్నామని CM CBN తెలిపారు. దీనికోసం కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ₹40వేల కోట్లు ఇస్తోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పారు. అధికారులు టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. 7వ తరగతి నుంచే AI బేసిక్స్‌పై బోధన ఉండాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని చెప్పారు.
News December 4, 2025
తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.


