News March 17, 2025

డీలిమిటేషన్‌పై అఖిల పక్ష సమావేశం

image

TG: డీలిమిటేషన్ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ అంశంపై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. డీలిమిటేషన్‌పై తమిళనాడులో జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్తుందని, ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరవుతారని చెప్పారు.

Similar News

News November 22, 2025

నాన్న 50ఏళ్లు ఇండస్ట్రీని తన భుజాలపై మోశారు: విష్ణు

image

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు మోహన్ బాబు 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ’94 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమను 50 ఏళ్లు మా నాన్న తన భుజాలపై మోశారు. ఆయన అసాధారణ ప్రయాణాన్ని చూడగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. 50 లెజెండరీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు. ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.

News November 22, 2025

గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

image

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో హార్డ్‌‌డిస్క్‌లు, పెన్‌‌డ్రైవ్‌లు ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

News November 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 74 సమాధానాలు

image

ప్రశ్న: విష్ణుమూర్తి ద్వార పలుకులు అయిన జయవిజయులు అసురులుగా ఎందుకు జన్మించారు?
సమాధానం: ఓసారి సనక సనందనాది మహర్షులు విష్ణు దర్శనానికి రాగా, వీరు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో కోపించిన మహర్షులు వారిని భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపించారు. వీరు 3 జన్మలలో (హిరణ్యాక్ష-హిరణ్యకశిప, రావణ-కుంభకర్ణ, శిశుపాల-దంతవక్ర) అసురులుగా పుట్టి, స్వామి చేతిలోనే మరణించి తిరిగి వైకుంఠం చేరారు.<<-se>>#Ithihasaluquiz<<>>