News December 4, 2024

అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ ‘సూపర్ 6 అమలుపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, ఆరోగ్య శ్రీ బకాయిలు, 104, 108 సిబ్బందికి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెంచారు. ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఆరోపించారు.

Similar News

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్: తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు విజయవంతమైంది. దాదాపు రూ.2.43లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35MOUలపై సంతకాలు జరిగాయి. CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిన్న డీప్‌టెక్‌, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ద్వారా రాష్ట్రం ‘విజన్ 2047’ దిశగా వేగంగా పయనిస్తూ.. సుస్థిరమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

News December 9, 2025

నేడే తొలి T20.. హై స్కోరింగ్ గేమ్!

image

SAతో భారత్ 5 మ్యాచుల T20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్‌లో జరగనుంది. ఇది బ్యాటర్లకు అనుకూలించే పిచ్ కావడం, 2 జట్లలో హిట్టర్లు ఉండటంతో హైస్కోరింగ్ గేమ్ చూసే అవకాశముందని క్రీడావర్గాలు చెబుతున్నాయి. 2015, 2022లో ఇక్కడ SAతో భారత్ ఆడిన 2 T20ల్లోనూ ఓడింది. అటు ఇవాళ ఓ వికెట్ తీస్తే 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డ్ సృష్టించనున్నారు. 7PMకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.

News December 9, 2025

మోక్షాన్ని కలిగించే సప్త క్షేత్రాలు

image

అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, ద్వారక.. ఈ 7 నగరాలను ముక్తి స్థలాలు అంటారు. ఇక్కడ కొలువైన క్షేత్రాలను దర్శించుకుంటే మనిషికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. జీవితంలో ఒక్కసారైనా ఈ స్థలాలను దర్శించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చేసిన పాపాలు తొలగించుకోవడానికి, పరమాత్మ సాన్నిధ్యం పొందే అవకాశం కోసం చాలామంది ఇక్కడికి వెళ్తుంటారు. ఈ పవిత్ర క్షేత్రాలు భక్తిని, ఆధ్యాత్మికతను పెంచుతాయి.