News April 3, 2024
ప్రజలంతా మోదీని వ్యతిరేకిస్తున్నారు: శరద్ పవార్

విపక్ష కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా ఆలోచించలేదని ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ తెలిపారు. దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజల మూడ్ మారిపోయిందని అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని స్థలాల పేర్లను చైనా మార్చడంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బీజేపీని ఓడించగలిగే సామర్థ్యమున్న తమకే ప్రజలు ఓట్లేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 7, 2025
కోహ్లీ, బాబర్‌కు తేడా అదే: పాక్ క్రికెటర్

పాకిస్థాన్ క్రికెట్‌పై బాబర్ ఆజమ్ ఎంతో ప్రభావం చూపారని ఆ దేశ క్రికెటర్ ఆజం ఖాన్ అన్నారు. ‘బౌలింగ్‌కు పేరుగాంచిన పాకిస్థాన్‌ను బ్యాటింగ్ విషయంలో బాబర్ ఫేమస్ చేశారు. అచ్చం ఇండియా కోసం కోహ్లీ చేసినట్లే. అయితే కోహ్లీ కెరీర్ ప్రారంభంలో సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, సెహ్వాగ్, ధోనీ వంటి లెజెండ్స్ ఉన్నారు. కానీ బాబర్‌కు ఎవరున్నారు? అతడు ఎంతో భారం మోయాల్సి వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
News November 7, 2025
ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు

<
News November 7, 2025
బిహార్‌లో మరోసారి ఎన్డీయేదే విజయం: మోదీ

బిహార్‌లో నిన్న జరిగిన భారీ పోలింగ్ మరోసారి NDA ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలను ఇస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ కామెంట్లు చేశారు. జేడీయూ అబద్ధాల ప్యాకేజీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు. ‘జంగిల్ రాజ్’ను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రానివ్వద్దనే దృఢ సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు. నిన్న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ నమోదైంది.


