News March 31, 2024

ప్రజలంతా ప్రభుత్వ బాధితులే: పురందీశ్వరి

image

AP: వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి విమర్శలు చేశారు. నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ మాట ఆయన పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2లక్షలకు పైగా రుణ భారం ఉందన్నారు. ఇవి సరిపోవన్నట్టుగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నారని విమర్శించారు.

Similar News

News January 29, 2026

Oh Sh*t.. పైలట్ల ఆఖరి మాటలు ఇవే

image

బారామతి ఫ్లైట్ క్రాష్‌లో మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి కూడా ప్రాణాలు కోల్పోయారు. క్రాష్ ల్యాండింగ్‌కి ముందు వాళ్లు మాట్లాడిన ఆఖరి మాటలు కాక్‌పిట్‌‌లో రికార్డ్ అయ్యాయి. వాళ్లు కొన్ని క్షణాల ముందు ‘Oh Sh*t’ అని కేకలు వేసినట్లు DGCA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి.

News January 29, 2026

APPLY NOW: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 97 పోస్టులు

image

<>ఇన్‌కమ్<<>> ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ముంబై రీజియన్‌లో స్పోర్ట్స్ కోటాలో 97 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయి, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్‌లో పతకాలు సాధించినవారు అర్హులు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.incometaxmumbai.gov.in

News January 29, 2026

ఒకే రోజు రూ.25వేలు పెరిగిన కేజీ సిల్వర్ ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ సిల్వర్ రేటు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.25వేలు పెరిగి రూ.4,25,000కు చేరింది. కేవలం 3 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాన్నిచ్చింది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.