News February 23, 2025
ప్రజలంతా ఫిట్‌గా ఉండాలి: ప్రధాని మోదీ

దేశ ప్రజలంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్‌లో ఒబేసిటీ సమస్యను ప్రధాని ప్రస్తావించారు. నగరాల్లో పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ సమస్య పెరుగుతోందని చెప్పారు. దీని వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయని, పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలని పిలుపునిచ్చారు.
Similar News
News February 23, 2025
TGలో మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్

TG: మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ కంపెనీలు, బీర్ సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి ఎక్సైజ్ శాఖ అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని కోరుతూ నాణ్యత, ప్రమాణాలపై కంపెనీల నుంచి సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోవాలని నిర్ణయించింది.
News February 23, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. <
News February 23, 2025
గ్రూప్-2 వివాదంలో ఎవరి పాత్ర ఎంతంటే?: ఎమ్మెల్సీ చిరంజీవి

AP: గ్రూప్-2 వివాదంలో జగన్ పాత్రే అధికంగా ఉందని టీడీపీ MLC చిరంజీవి ఆరోపించారు. నోటిఫికేషన్ రావడం, రోస్టర్‌లో తప్పులు, హైకోర్టులో కేసులు జగన్ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. మెయిన్స్ FEB 23న పెట్టాలని హైకోర్టు సూచిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వాయిదా వేయాలని CBN కోరినట్లు తెలిపారు. పరీక్ష వాయిదాతో టీడీపీకి లబ్ధి అని YCP ఫిర్యాదు చేయగా రద్దు కుదరదని APPSC తేల్చినట్లు పేర్కొన్నారు.