News August 10, 2025

పులివెందులలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే: కడప ఎస్పీ

image

AP: ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్‌కు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘రెండు ప్రాంతాల్లో 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయి. ఈ 2 మండలాల్లో స్థానికేతరులు ఉండకూడదు’ అని SP ఆదేశించారు.

Similar News

News August 10, 2025

రేపు పీఎం ఫసల్ బీమా యోజన నిధులు విడుదల

image

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 30లక్షల మంది రైతులకు రేపు పంట బీమా నిధులు రిలీజ్ చేయనున్నారు. రాజస్థాన్‌లో జుంజునులో జరిగే కార్యక్రమంలో రూ.3,200 కోట్ల నగదును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అత్యధికంగా మధ్య‌ప్రదేశ్ రైతులకు రూ.1,156కోట్లు, రాజస్థాన్‌కు రూ.1,121కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.150కోట్లు, ఇతర రాష్ట్రాల రైతులకు రూ.773కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు.

News August 10, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

News August 10, 2025

టాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్స్ వారే: సాయి‌ధరమ్ తేజ్

image

టాలీవుడ్‌లో మోస్ట్ స్టైల్ ఐకాన్ రామ్ చరణ్ అని మెగా హీరో సాయి‌ధరమ్ తేజ్(SDT) చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా మరో స్టైలిష్ యాక్టర్ అని తెలిపారు. నిన్న జరిగిన ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 వేడుకలో మోస్ట్ డిజైరబుల్(మేల్) అవార్డును SDT సొంతం చేసుకున్నారు. అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరెంజ్ మూవీలో RC లుక్స్ తన ఆల్‌టైం ఫేవరెట్ అని పేర్కొన్నారు.