News April 30, 2024
ఏపీఆర్‌సెట్‌కు సర్వం సిద్ధం

AP: యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఆర్‌సెట్‌కు ఏర్పాట్లు పూర్తైనట్లు కన్వీనర్ దేవప్రసాదరాజు తెలిపారు. మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తామని.. రోజుకు 2 సెషన్లలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక సెంటర్, ఏపీలో 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని.. మే 20వ తేదీ నాటికి ఫలితాలను విడుదల చేసి, జూన్‌లో ఇంటర్వ్యూలు చేపడతామని వెల్లడించారు.
Similar News
News March 12, 2026
సాఫ్ట్‌వేర్ కంపెనీలను రీప్లేస్ చేసే ‘మాక్రోహార్డ్’!

సాఫ్ట్‌వేర్ కంపెనీలు చేయగలిగే అన్ని పనులను చక్కబెట్టే AI టూల్స్‌ను సిద్ధం చేయడం కోసం మస్క్ మాక్రోహార్డ్ ప్రాజెక్టును ప్రకటించారు. టెస్లా డిజిటల్ ఆప్టిమస్, గ్రోక్ LLM టెక్‌ను వాడి వీటిని తయారు చేయనున్నట్లు చెప్పారు. చౌకగా దొరికే టెస్లా AI4 చిప్స్‌ను వాడనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ కుదిపేస్తున్న తరుణంలో మస్క్ ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
News March 12, 2026
OTD: భారతదేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఉగ్రదాడి!

భారత్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లకు నేటితో 33 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజున దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ ముఠా జరిపిన 12 పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 1,400 మంది క్షతగాత్రులయ్యారు. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, ఎయిర్ ఇండియా భవన్ వంటి కీలక ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ మారణహోమం నేటికీ దేశాన్ని కలచివేస్తోంది. దోషి యాకూబ్ మెమన్‌ను 2015లో ఉరితీశారు.
News March 12, 2026
మోనాలిసా పెళ్లిపై డైరెక్టర్ సంచలన కామెంట్స్

కుంభమేళా వైరల్ బ్యూటీ <<19356893>>మోనాలిసా<<>> పెళ్లిపై ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆ అమ్మాయిని నేను గంగామాత అవతారంగా భావిస్తాను. ఆమెతో సినిమా కోసం నేను రూ.10 కోట్లు లోన్ తీసుకున్నాను. జైలుకు కూడా వెళ్లాను. కానీ ఇప్పుడు ఓ ముస్లింతో పారిపోయింది. మొత్తం నాశనం చేసింది. ఇది తిరుగుబాటు కాదు. లవ్ జిహాద్. జైలు బయట వాళ్ల నాన్న ఏడ్చినా ఆమె పట్టించుకోలేదు’ అని తెలిపారు.


