News October 20, 2024

మున్నాభాయ్-3కి రంగం సిద్ధం: హిరానీ

image

సంజయ్‌దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మూడో పార్ట్‌‌ కోసం కసరత్తు చేస్తున్నామని, స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోందని డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ వెల్లడించారు. గత సినిమాల కంటే మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రాలను తెలుగులో శంకర్‌దాదా MBBS, శంకర్‌దాదా జిందాబాద్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు.

Similar News

News November 27, 2025

రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

image

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.

News November 27, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

News November 27, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (<>TSLPRB<<>>) 60 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.tgprb.in