News July 7, 2024

అందర్నీ ముస్లింలుగా మార్చాలి.. మేయర్ సెన్సేషనల్ కామెంట్స్

image

ముస్లిమేతరులను ముస్లింలుగా మార్చాలని కోల్‌కతా TMC మేయర్ ఫిర్హాద్ హకీం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అవి వివాదాస్పదం కాగా మళ్లీ స్పందిస్తూ తన వ్యాఖ్యల్లో తప్పులేదని, తాను లౌకికవాదినని, అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. ఆల్ ఇండియా ఖురాన్ కాంపిటిషన్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించే సమయంలో ‘ముస్లిమేతరులుగా పుట్టినవారు దురదృష్టవంతులు. వారిని ఇస్లాంలోకి తీసుకురావాలి’ అని అన్నారు.

Similar News

News February 8, 2026

బంగ్లా హిందువులకు మద్దతు లభిస్తుంది: RSS

image

బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై RSS చీఫ్ మోహన్ భాగవత్ శతాబ్ది ఉత్సవాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాలో దాదాపు రూ.1.25 కోట్లమంది హిందువులు ఉన్నారు. వారి హక్కుల కోసం పోరాడాలి అనుకుంటే ప్రపంచంలోని హిందువులంతా వారికి మద్దతుగా నిలుస్తారు’ అని తెలిపారు. అలాగే ‘RSS చీఫ్ పదవికి విరమణ అనేది ఉండదు. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి కూడా రాలేదు. అయితే దిగమంటే దిగిపోతాను’ అని స్పష్టం చేశారు.

News February 8, 2026

బ్రౌన్ షుగర్‌తో ఎన్నో లాభాలు

image

వైట్ షుగర్ కంటే బ్రౌన్ రంగు షుగర్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. బ్రౌన్ షుగర్ తీసుకోవడంవ‌ల్ల జీర్ణ సమస్యలు తొల‌గిపోతాయి. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లను తగ్గించడానికి, కేల‌రీలు త‌క్కువ‌గా ఉండ‌టంవ‌ల్ల బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ బి6, నియాసిన్, పాంతోతెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్‏గా పనిచేస్తాయి.

News February 8, 2026

NEET (UG) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

image

దేశవ్యాప్తంగా UG మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET(UG) 2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో మే 3న ఈ పరీక్ష జరగనుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు ₹1700, EWS, OBC-NCL వారికి ₹1600, SC, ST, PwBD, థర్డ్ జెండర్ ₹1000, ఔట్ సైడ్ ఇండియా అభ్యర్థులకు ₹9500గా ఉంది.
వెబ్‌సైట్: <>https://neet.nta.nic.in/<<>>