News July 4, 2024

నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్

image

AP: వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు స్లాట్‌లను విడుదల చేశారు. ఇందుకోసం మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. స్లాట్‌లు బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు స్క్రీనింగ్ నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు.

Similar News

News March 30, 2026

రిటైర్మెంట్, పెన్షన్లను Gen Z నమ్మట్లే!

image

ఆర్థిక సవాళ్ల కారణంగా Gen Z(1997-2012) రిటైర్మెంట్‌ను ఒక ఆప్షన్‌గానూ భావించట్లేదు. పెన్షన్లపై నమ్మకం లేదని, జీవితాంతం పనిచేస్తూనే ఉండాల్సి వస్తుందని 12శాతం మంది యువత భావిస్తోంది. ఆర్థిక విషయాలపై అవగాహన లేకపోవడం, పెరుగుతున్న ఖర్చులే ఇందుకు కారణం. అయితే చిన్న వయసు నుంచే పొదుపు చేస్తే భారీ లాభం ఉంటుందని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News March 30, 2026

బంగ్లాదేశ్‌లో IPL టెలికాస్ట్ లేనట్లే

image

బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచుల ప్రసారం జరిగే అవకాశం లేదు. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం మ్యాచుల ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బ్రాడ్‌కాస్ట్ అగ్రిమెంట్‌ను జియో స్టార్ తాజాగా రద్దు చేసుకుంది. 2023-2027 వరకు ప్రసార హక్కులను తీసుకున్న బంగ్లా ఛానల్ ‘టీ స్పోర్ట్స్’ గడువులోగా పేమెంట్స్ చేయలేదు. దీంతో జియో స్టార్ ఒప్పందాన్ని రద్దు చేసింది. WPLకూ ఇది వర్తించనుంది.

News March 30, 2026

KCRను గృహ నిర్బంధం చేశారని నా అనుమానం: CM రేవంత్

image

TG: రావణుడి వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని, కేసీఆర్ ఉండటం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆయన లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని మీడియాతో చిట్‌‌చాట్‌లో తెలిపారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారని, కానీ తన అనుమానం ప్రకారం ఆయనను గృహ నిర్బంధం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.