News March 28, 2024

సదరం స్లాట్లు విడుదల

image

AP: ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సదరం స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వీరికి ఏప్రిల్ 8 నుంచి ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ENT వైద్యులు టెస్టులు చేసి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు.

Similar News

News March 7, 2026

‘పుష్పక్’ వచ్చేస్తోంది.. హార్ముజ్ దాటిన భారత నౌక

image

యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రవాణా చేసే వందలాది నౌకలు అక్కడే నిలిచిపోయాయి. సోమవారం నుంచి కేవలం 9 ఓడలు మాత్రమే జలసంధిని దాటాయి. ఇందులో భారత్‌కు చెందిన ‘పుష్పక్’ కూడా ఉంది. ఇది పెట్రోలియం ఉత్పత్తులను ఇండియాకు తీసుకొస్తోంది. దీంతో దేశంలో ఇంధన నిల్వలకు మరింత బూస్ట్ రానుంది.

News March 7, 2026

మెదడును చురుగ్గా పనిచేయించే ‘కోకో’

image

కోకో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలోని ఫ్లావనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత పెరగడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మానసిక అలసట తగ్గుతుందని పేర్కొన్నారు. రోజుకు 3 చెంచాల కోకో పౌడర్‌ను పాలు/ నీటిలో కలుపుకుని తాగితే మెదడు మరింత చురుగ్గా మారుతుందని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లోనూ కోకో ఉంటుంది.

News March 7, 2026

ఇరాన్‌లో మరోసారి భూకంపం

image

US, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో <<19288652>>భూకంపం సంభవించడం<<>> తెలిసిందే.