News October 25, 2025
అన్ని రాష్ట్రాలకు ‘హైడ్రా’ అవసరం: పవన్

హైడ్రా లాంటి వ్యవస్థ APతో పాటు అన్ని రాష్ట్రాలకు అవసరమని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. పాలకుల ముందుచూపు, నిబద్ధతగల అధికారుల పనితీరు ఏ వ్యవస్థకైనా మంచి పేరు తీసుకువస్తుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా హైడ్రా రూపంలో సరికొత్త వ్యవస్థను TG ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ఇవాళ మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌లో పవన్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News February 11, 2026
ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎంతంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.270 తగ్గి రూ.1,58,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 11, 2026
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లలు, యుక్తవయస్సు వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో BP ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో BP ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి BP చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.
News February 11, 2026
పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.


