News September 26, 2024

ఎన్టీఆర్, కార్తీ సినిమాలకు ఆల్‌ ది బెస్ట్: సాయి ధరమ్

image

ఎన్టీఆర్ ‘దేవర’, కార్తీ ‘సత్యం సుందరం’ సినిమాలకు సాయి ధరమ్ తేజ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘భారీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్న తారక్‌కు, కళ్యాణ్ రామ్, అనిరుధ్, కొరటాల శివ, సైఫ్, జాన్వీ, మొత్తం బృందానికి ఆల్‌ ది బెస్ట్. సినిమా బ్లాక్‌బస్టర్‌కి తక్కువ కాకూడదు. కార్తీ అన్న, ప్రేమ కుమార్ ‘సత్యం సుందరం’ వంటి సినిమాను మన వద్దకు తీసుకొస్తుండటం చాలా సంతోషంగా ఉంది. వారి టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 3, 2026

ఏపీలో కొత్త పోర్టు.. 2 వేల ఎకరాల్లో..

image

AP: తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు, మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ పోర్టు ట్రస్టు, ఏపీ మారిటైమ్ బోర్డు సహకారంతో 2వేల ఎకరాల్లో వీటిని నిర్మించనున్నారు. 2047 మారిటైమ్ అమృత్ కాల్ విజన్ కింద కేంద్రం రాష్ట్రాలకు భారీ లక్ష్యాలను నిర్దేశించింది. ప్రపంచశ్రేణి షిప్ బిల్డింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.

News January 3, 2026

చైనా సైన్యాన్ని మోహరిస్తుందేమో.. జైశంకర్‌కు బలూచ్ నేత లేఖ

image

పాక్‌తో చైనా పొత్తు మరింత బలపడుతోందని బలూచిస్థాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ‘బలూచ్ డిఫెన్స్-ఫ్రీడమ్ ఫోర్సెస్‌ను బలోపేతం చేయకపోతే ఇక్కడ చైనా సైన్యాన్ని మోహరించే అవకాశం ఉంది. ఇది మాకు, ఇండియాకు ముప్పు’ అని పేర్కొన్నారు. భారత్, బలూచ్ మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో మోదీ తీసుకున్న చర్యలను ప్రశంసించారు.

News January 3, 2026

వాట్సాప్‌లో న్యాయ సలహాలు, సమాచారం

image

కేంద్ర ప్రభుత్వం ‘న్యాయ సేతు’ సేవలను వాట్సాప్‌లోనూ అందిస్తోంది. 7217711814 నంబర్‌కి HI అని మెసేజ్ చేయగానే ‘Tele-Law’ చాట్‌బాట్ లీగల్ హెల్ప్/ఇన్ఫర్మేషన్/అసిస్టెన్స్ ఆప్షన్లు చూపిస్తుంది. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని సేవలు పొందవచ్చు. ప్రజలకు లీగల్ హెల్ప్ అందించేందుకు 2024లో కేంద్రం ‘న్యాయ సేతు’ పేరిట డిజిటల్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాని సేవలను వాట్సాప్‌కు ఎక్స్‌టెండ్ చేసింది.