News June 2, 2024

తిరుమలలో కంపార్టుమెంట్లన్నీ ఫుల్

image

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. స్వామివారిని నిన్న 78,686 మంది భక్తులు దర్శించుకోగా.. 37,888 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వివరించారు.

Similar News

News November 27, 2025

కామారెడ్డి: పంచాయతీ ఎన్నికల నామినేషన్ నియమాలు..

image

*21 Yrs నిండి ఉండి, ఆ గ్రామంలో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
*అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్‌ను ఉ.10.30 నుంచి సా.5 గంటలలోపు సమర్పించాలి.
* ఇంటి పన్ను కట్టి ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాలి.
* డిపాజిట్ రుసుము సర్పంచ్ ₹2వేలు, వార్డు సభ్యుడు ₹500
*కుల ధృవీకరణ పత్రం (లేదా డిప్యూటీ తహసీల్దార్ సంతకం), రెండు స్వీయ ధృవీకరణ సాక్షులు, ఎన్నికల ఖర్చు ఖాతా డిక్లరేషన్, గుర్తింపు కార్డు కోసం ఫోటో అవసరం

News November 27, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

News November 27, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (<>TSLPRB<<>>) 60 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.tgprb.in