News June 4, 2024

YCPని వదిలేసిన ఎమ్మెల్యేలందరూ గెలిచారు!

image

AP: ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలందరూ తిరిగి మళ్లీ గెలిచారు. గుమ్మనూరి జయరామ్ (గుంతకల్లు), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), వసంత కృష్ణప్రసాద్ (మైలవరం), కొలుసు పార్థసారథి (నూజివీడు) టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

Similar News

News November 20, 2025

సంగారెడ్డి: ‘మంత్రి ఇంటిని ముట్టడిస్తాం’

image

వైద్య శాఖలో పనిచేస్తున్న NHM ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని ముట్టడిస్తామని మెడికల్ హెల్త్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి గురువారం హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల ఆందోళనకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు.

News November 20, 2025

ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.

News November 20, 2025

రాజమౌళి సినిమాలు ఆపేస్తాం.. VHP వార్నింగ్

image

హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని VHP నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే VHP క్షమించదని స్పష్టం చేశారు. కాగా రాజమౌళి కామెంట్స్‌‌‌ను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సైతం ఖండించారు.