News May 24, 2024

ఆ ఊరిలో మనుషులంతా దేవుళ్లే!

image

AP: విజయనగరం(D) బొండపల్లి(M) గొల్లపాలెంలో అంతా దేవుళ్లే ఉంటారు. ఒకర్నొకరు దేవుడు.. అని పిలుచుకుంటారు. అందరి పేర్లలోనూ దేవుడు అనే పదం ఉండటమే దీనికి కారణం. సింహాద్రి దేవుడు, తిరుపతి దేవుడు, లక్ష్మీ దేవుడమ్మ, రమాదేవి దేవుడమ్మ వంటి పేర్లే ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ మొదటి మగ, ఆడ సంతానానికి దేవుడు లేదా దేవుడమ్మ అని పెడతారు. సింహాద్రి అప్పన్నపై భక్తి వల్లే వందల ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.

Similar News

News December 6, 2025

HYDలో పెరిగిన పాదచారుల ‘రోడ్‌కిల్’

image

HYDలో ఫుట్‌పాత్‌ల లేమి, ఆక్రమణల కారణంగా పాదచారుల మరణాలు పెరుగుతున్నాయి. 2024లో సుమారు 400 మంది మరణించగా, 1,032 ప్రమాదాలు జరిగాయి. 2025లో ఇప్పటి వరకు 510 మరణాలకు ఇదే కారణం. ఐటీ కారిడార్లలో సైతం కిలోమీటరుకు సగటున 7 అడ్డంకులు ఉండటంతో ఉద్యోగులు నడవలేకపోతున్నారు. 7,500 స్టాల్స్ తొలగించినా, సమస్య పరిష్కారం కాలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

News December 6, 2025

అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

*విదేశాల్లో ఎకనామిక్స్‌లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్‌లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి

News December 6, 2025

నితీశ్‌ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

image

బిహార్‌ CM నితీశ్‌కుమార్‌ తనయుడు నిశాంత్‌ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.