News March 2, 2025
టీమ్ఇండియా కోసం జట్లన్నీ దుబాయ్‌లోనే

CTలో భారత మ్యాచులు ఇతర జట్లకు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకున్నా ఏ జట్టుతో ఆడాలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ప్రాక్టీస్ చేసేందుకు AUS పాక్ నుంచి దుబాయ్‌కు చేరుకోగా SAనూ ఇక్కడికి రప్పిస్తున్నారు. ఇవాళ్టి మ్యాచ్ కోసం NZ దుబాయ్‌లోనే ఉంది. కివీస్‌పై గెలిస్తే గ్రూప్-ఏలో భారత్ టాప్‌లో నిలిచి గ్రూప్-బిలో రెండోస్థానంలో ఉన్న ఆసీస్‌తో, ఓడితే దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Similar News
News October 23, 2025
తుని ఘటనలో సంచలన విషయాలు

AP: కాకినాడ(D) తునిలో బాలికపై వృద్ధుడి <<18071366>>లైంగికదాడి <<>>కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గురుకులలో చదువుతున్న అమ్మాయికి తినుబండారాలు కొనిచ్చి, మాయమాటలు చెప్పి నిందితుడు నారాయణరావు(62) దగ్గరయ్యాడని తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చూపిస్తానని స్కూలు నుంచి పలుమార్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అతడిపై పోక్సో సహా 3 కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
News October 23, 2025
నేడు..

* ఇవాళ <<18073538>>తెలంగాణ<<>> మంత్రివర్గ సమావేశం.. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం
* గోరక్షక్ దళ్ సభ్యుడిపై దాడికి నిరసనగా డీజీపీ ఆఫీసు ఎదుట బీజేపీ నేతల నిరసన
* వైసీపీ చీఫ్ జగన్ మీడియా <<18075756>>సమావేశం<<>>
* WWCలో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమ్ఇండియా
* ప్రభాస్-హను రాఘవపూడి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్, ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
News October 23, 2025
బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్‌కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.