News October 8, 2025
MBU ప్రతిష్ఠను దిగజార్చాలనే ఇవన్నీ: విష్ణు

మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా APHERMC చేసిన సిఫార్సులను మంచు విష్ణు ఖండించారు. ‘ఆ సిఫార్సులపై <<17943028>>MBU<<>>కు మద్దతుగా హైకోర్టు స్టే ఇచ్చింది. వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చాలనే కొంత సమాచారాన్నే ప్రచారం చేస్తున్నారు. ఈ నిరాధారమైన వార్తలను నమ్మొద్దని కోరుతున్నాం. ఎంతో మందికి ఉచిత విద్య అందించాం. అనాథలను దత్తత తీసుకుని సంరక్షించాం. ఆర్మీ, పోలీసుల పిల్లలకు పూర్తి స్కాలర్‌షిప్ ఇచ్చాం’ అని తెలిపారు.
Similar News
News October 8, 2025
జియో భారత్ కొత్త ఫోన్.. ఫీచర్లేమిటంటే

జియో భారత్ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. పెద్దలు, పిల్లల వినియోగానికి అనుగుణమైన సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. లొకేషన్ మానిటరింగ్, యూసేజ్ మేనేజింగ్ వ్యవస్థతోపాటు బ్యాటరీ బ్యాకప్ 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాల్స్, మెసేజ్‌ల నియంత్రణ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రారంభ ధర ₹799గా నిర్ణయించింది. ఇప్పటికే తెచ్చిన జియో పీసీలలో AI క్లాస్ రూమ్ ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నామని తెలిపింది.
News October 8, 2025
హైకోర్టు నుంచి సీఎం ఇంటికి మంత్రులు, ఏజీ

TG: BC రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేలకపోవడంతో CM రేవంత్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి AG, లాయర్లు, మంత్రులను తన నివాసానికి రావాలని సూచించారు. రేపు కోర్టులో వాదనలు, ఎలాంటి తీర్పు ఉండబోతుందనే తదితర అంశాలను చర్చించనున్నారు. అటు విచారణ వాయిదా పడటంతో SEC నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కోర్టు ప్రాంగణంలోనే ఏజీతో మంత్రుల బృందం సమావేశమైంది.
News October 8, 2025
మహిళల్లోనే డిప్రెషన్ అధికం.. కారణమిదే!

సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళల్లో డిప్రెషన్ రెట్టింపు ఉంటుంది. ఇందుకు జీన్స్(జన్యువులు) కారణమని తాజా అధ్యయనం తెలిపింది. పురుషుల కంటే మహిళల్లో 6,000 జీన్ వేరియంట్స్ అదనంగా ఉంటాయని ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో పబ్లిష్ అయిన స్టడీ పేర్కొంది. జనరిక్ ఫ్యాక్టర్స్ వల్లే ఉమెన్స్‌లో డిప్రెషన్ రిస్క్ పెరుగుతుందని వెల్లడించింది. ఈ జీన్ వేరియంట్స్ వారసత్వంగా లేదా సహజంగా కూడా ఏర్పడతాయంది.