News July 6, 2024
ఆ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి: నిరంజన్ రెడ్డి

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు మీడియాతో పేర్కొన్నారు. దీనిపై ఆయన స్పందించాలని కోరారు. ఆరు గ్యారంటీల ఊసెత్తకుండా ఇలాగే పాలన కొనసాగితే ప్రజలు ఉపేక్షించరని దుయ్యబట్టారు.
Similar News
News March 20, 2026
ధురంధర్-2: తొలి రోజే ₹100 కోట్లు!

భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. తొలి రోజే ₹102 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిందని Sacnilk తెలిపింది. ప్రీమియర్స్తో కలుపుకొని ₹145 కోట్లు(₹172 Cr గ్రాస్) రాబట్టిందని వెల్లడించింది. 12,735 ప్రీమియర్ షోలు, తొలి రోజు 21,728 షోలు పడినట్లు చెప్పింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
News March 20, 2026
ఆ 22 నౌకలొస్తేనే..

పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే శివాలిక్, నందాదేవి నౌకలు LPGతో భారత్ చేరుకోవడంతో స్వల్ప ఉపశమనం లభించింది. కానీ మరో 22 షిప్లు <<19422225>>హార్ముజ్<<>> వద్దే నిలిచిపోయాయి. ఈ నౌకలే భారత ఇంధన భద్రతకు కీలకం. వీటిని హార్ముజ్ దాటించడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నౌకల రాక ఆలస్యమైనా, చాలాకాలం అక్కడే చిక్కుకుపోయినా దేశంలో గ్యాస్ కొరత మరింత తీవ్రమయ్యే ఆస్కారముంది.
News March 20, 2026
భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 నిర్వహణకు భారత్కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈవెంట్ నిర్వహించేందుకు భారత్, న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. మౌలిక వసతుల పరిశీలన అనంతరం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి వచ్చింది. దీంతో ఆసియాలో జపాన్, ఖతర్, చైనా తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2026 పోలాండ్ వేదికగా నేడు ప్రారంభం కానుంది.


