News January 6, 2025

ఆ ప్రాజెక్టులన్నీ మా హయాంలో వచ్చినవే: గుడివాడ అమర్నాథ్

image

AP: తమ హయాంలో వచ్చిన ప్రాజెక్టులన్నీ కూటమి ప్రభుత్వంలో వచ్చినట్లు TDP గొప్పలు చెప్పుకుంటోందని YCP నేత గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ YCP హయాంలో వచ్చినవేనని చెప్పారు. ‘శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, వైజాగ్‌లో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఐటీ పరిశ్రమలు మేమే తీసుకొచ్చాం. దీనిపై మేం చర్చకు సిద్ధం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News February 6, 2025

US నుంచి భారత్‌కు ఫ్లైట్.. ఏ రాష్ట్రం వారు ఎందరున్నారంటే?

image

మన దేశానికి చెందిన కొందరిని US అక్రమ వలసదారులుగా గుర్తించి సైనిక విమానంలో తిరిగి పంపిన విషయం తెలిసిందే. టెక్సాస్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ఈ మధ్యాహ్నం విమానం రాగా అందులో 104 మంది భారతీయులున్నారు. వారిలో 30మంది పంజాబ్, 33మంది హరియాణా, 33మంది గుజరాత్ వాసులున్నారు. వీరితో పాటు MHకు చెందిన ముగ్గురు, UPకి చెందిన ముగ్గురు, చంఢీగఢ్‌ వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

News February 6, 2025

రోహిత్ పరుగుల దాహం తీరనుందా?

image

ఇంగ్లండ్‌తో రేపు వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ ఫ్యాన్స్ SMలో సందడి చేస్తున్నారు. గత 14 వన్డేల్లో హిట్‌మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు. అదే ఫామ్ కొనసాగించి పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు. BGTలో ఇబ్బంది పడిన రోహిత్ ఇంగ్లండ్‌పై పరుగుల దాహం తీర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ COMMENT.

News February 6, 2025

నిద్రలో మూత్రం ఆపుకుంటున్నారా?

image

మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుంది. రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్ర డిస్టర్బ్ అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు. ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!