News August 13, 2024
ఆ దేశాధినేతలు ముగ్గురూ బలమైనవారు: ట్రంప్

రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాధినేతలపై US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆ ముగ్గురూ అత్యుత్తమ దశలో ఉన్నారని, వారిని అడ్డుకునేందుకు అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని మస్క్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పుతిన్, జిన్‌పింగ్, కిమ్ ముగ్గురూ తెలివైనవాళ్లే. ప్రమాదకారులు కూడా. తమ దేశాన్ని రక్షించుకోవాలని చూస్తారు. కమలను, నిద్రముఖం బైడెన్‌ను చూసి నవ్వుకుంటారేమో’ అని పేర్కొన్నారు.
Similar News
News February 6, 2026
2027 ఫిబ్రవరి 9 నుంచి ఏపీలో జనగణన: CS

APలో వచ్చే ఏడాది FEB 9 నుంచి 28 వరకు జనగణన నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ చెప్పారు. జనగణన సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట సమయంలోగా చేపట్టాల్సిన పనులపై ప్రత్యేకంగా బుక్‌లెట్‌ను రూపొందించి జిల్లాలకు పంపాలని సూచించారు. కాగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు <<18793970>>గృహాల మ్యాపింగ్<<>> జరగనుంది.
News February 6, 2026
PM కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్రం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తీసుకొచ్చింది. AP, TGల్లో దీని కోసం నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. PM కిసాన్, ఫసల్ బీమా, ఇతర కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందాలంటే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి. దీన్ని ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలి? ఏ పత్రాలు అవసరం? ఈ ప్రక్రియ వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకోవడానికి<<-se_10015>> పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News February 6, 2026
మున్సిపల్ ప్రచారంలో AI పాటలు

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి AI కొత్త ఊపునిస్తోంది. అభ్యర్థుల పేరు, గుర్తు, వార్డు వివరాలు, సేవా కార్యక్రమాలను ఏఐకి అందిస్తే చాలు ఆకట్టుకునే ప్రచార పాటలు నిమిషాల్లో సిద్ధమవుతున్నాయి. రచయిత, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్ అవసరం లేకుండానే స్లో నుంచి ఫాస్ట్ బీట్ వరకూ, జానపదం నుంచి భక్తిగీతాల దాకా పాటలు క్రియేట్ అవుతున్నాయి. ఇందుకోసం Suno, Beatoven, Make my song, Udio వంటి ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.


