News September 20, 2024

All Time Record: ఫస్ట్‌టైమ్ 84000 బ్రేక్ చేసిన సెన్సెక్స్

image

BSE సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇంట్రాడేలో 1000 పాయింట్లు పెరిగిన సూచీ తొలిసారి 84,000 స్థాయిని బ్రేక్ చేసింది. ఒకానొక దశలో 84,240నూ టచ్ చేసింది. దీంతో BSEలోని కంపెనీల మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.469.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక నిఫ్టీ50 ఫస్ట్‌టైమ్ 25,725 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. నేడు ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు అదరగొడుతున్నాయి.

Similar News

News September 20, 2024

100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం: వైసీపీ

image

AP: కూటమి ప్రభుత్వం గత 100 రోజుల్లో ప్రజలకు చేసింది ‘సున్నా’ అని వైసీపీ విమర్శించింది. ‘సూపర్-6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. దాడులు, దౌర్జన్యాలతో కక్షసాధింపులకే పరిమితం అయింది. ఈ 100 రోజుల్లో 50 మందికి పైగా ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం రావణకాష్ఠంగా మారింది. మంచి ప్రభుత్వమంటూ ప్రచారం తప్ప ఈ 100 రోజుల్లో ప్రజలకు ఒరిగిందేమిటి?’ అని ట్వీట్ చేసింది.

News September 20, 2024

టీటీడీ ఈవోకు చంద్రబాబు ఆదేశం

image

AP: టీటీడీలో నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.

News September 20, 2024

త్వరలోనే EHS రూపొందిస్తాం: మంత్రి దామోదర

image

TG: ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన EHSను త్వరలో రూపొందిస్తామని మంత్రి రాజనర్సింహ అన్నారు. 2014లో ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్ ప్రవేశపెడతామని ఊదరగొట్టి BRS మొండిచేయి చూపించిందని దుయ్యబట్టారు. ఇప్పుడు BRS పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అన్నారు. 10ఏళ్లుగా నిద్రలో జోగిన BRS నాయకులకు ఇప్పుడు EHS గుర్తుకు రావడం విడ్డూరమన్నారు.