News October 7, 2024
ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే: ఒవైసీ

TG: హైడ్రా కూల్చివేతలపై 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారమే ముందుకెళ్లాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. బాపూఘాట్‌తో సహా ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ సచివాలయం కూడా ఆ పరిధిలోనే ఉందని చెప్పారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ముందుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Similar News
News April 1, 2026
కేజీబీవీ దరఖాస్తు గడువు 10వరకు పొడిగింపు

AP: KGBV స్కూళ్లలో 2026-27లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగిస్తున్నట్లు SSA ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 6, 11 తరగతుల్లో అన్ని సీట్లతో పాటు 7, 8, 9, 10, 12 క్లాసుల్లో ఖాళీ సీట్లకు బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుకు ఇవాళ్టితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు పెంచినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలన్నారు. ఇక్కడ <
News April 1, 2026
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్

TG: విద్యుత్ వినియోగదారులందరికీ శుభవార్త. 2026లో గృహ అవసరాలకు వాడే విద్యుత్‌కు ఛార్జీల పెంపు లేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నాన్- డొమెస్టిక్ వినియోగదారులకు పీక్ అవర్స్‌లో వర్తించే ToD (Time of Day) ఛార్జీని యూనిట్‌కు రూ.1 నుంచి రూ.1.50కి పెంచింది. అటు కరెంట్ షాక్‌కు గురైన వారికి అందించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది.
News April 1, 2026
రేపు ప్రధానితో లోకేశ్ భేటీ

AP: మంత్రి లోకేశ్ ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉ.10.30 గం.కు ప్రధాని మోదీని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. అంతకుముందు అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చను మొత్తం టీవీలో చూశానని లోకేశ్ తెలిపారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడని స్పష్టం చేశారు.


