News December 17, 2024
రేపు టీడీపీలోకి ఆళ్ల నాని

AP: మాజీ మంత్రి, ఏలూరు YCP మాజీ MLA ఆళ్ల నాని రేపు TDPలో చేరుతున్నారు. అమరావతిలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారు. టీడీపీ అధిష్ఠానం సూచన మేరకు ఆళ్ల నాని చేరికకు తాను అంగీకరించినట్లు ఏలూరు TDP ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు. కానీ నాని చేరికపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.
News December 1, 2025
ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్‌గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్‌ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.
News December 1, 2025
‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.


