News October 20, 2024
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆలపాటి, పేరాబత్తుల ఖరారు

AP: పట్టభద్ర MLC స్థానాలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(కృష్ణా-గుంటూరు), పేరాబత్తుల రాజశేఖర్(ఉ.గో) పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారుచేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఆలపాటి తెనాలి, రాజశేఖర్ కాకినాడ రూరల్ స్థానాలను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీట్లు జనసేనకు వెళ్లిన విషయం తెలిసిందే.
Similar News
News November 26, 2025
అనకాపల్లి MP కన్నీటి ట్వీట్

కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచిన <<18391262>>అమ్మ<<>> రత్నమ్మ (83) ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం భారంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటలతో చెప్పలేనంత గొప్పవని అన్నారు. అమ్మ లేకపోవడం మాటల్లో చెప్పలేని పెద్ద లోటుగా మిగిలిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
News November 26, 2025
ఆనంద నిలయం విశేషాలివే..

శ్రీవారి దర్శనంతో భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చేదే ‘ఆనంద నిలయం’. ఇది ఆదిశేషుని పడగ మీద ఉన్న ఆనంద పర్వతంపై ఉంటుంది. ఆ కారణంగానే దీనికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. తొండమాను చక్రవర్తి నిర్మించిన ఈ నిలయానికి పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మ బంగారు పూతను, వీరనరసింగదేవ యాదవరాయలు తులాభారం ద్వారా బంగారు మలామాను చేయించారు. శ్రీనివాసుడు శిలగా మారింది ఈ ఆనంద నిలయంలోనే. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 26, 2025
రాజ్యాంగం@76 ఏళ్లు

భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించనుండగా ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువుతారు. తర్వాత తెలుగు, తమిళం, మరాఠీ సహా 9 భాషల్లో డిజిటల్ రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.


