News September 4, 2025
భార్గవ్‌పై ఆరోపణలు అవాస్తవం: సజ్జల రామకృష్ణారెడ్డి

AP: లిక్కర్ కేసులో భార్గవ్‌పై ఆరోపణలు అవాస్తవమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘భీమ్ స్పేస్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదు. అకౌంట్ లేని కంపెనీ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయి?. భీమ్ స్పేస్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న ప్రద్యుమ్న గతంలో ఓ టీవీ ఛానల్‌లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ ఛానల్‌తో నారా లోకేశ్ సన్నిహితంగా ఉండేవారు. లోకేశ్‌కి ప్రద్యుమ్న సన్నిహితుడు కావొచ్చు’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News January 27, 2026
పుస్తకాలే లోకమైన అక్షర తపస్వికి దక్కిన గౌరవం!

పుస్తకాలపై మక్కువతో తన ఆస్తినే అమ్ముకున్న కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బస్ కండక్టర్‌గా పనిచేస్తూనే 20 లక్షల పుస్తకాలతో అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందులో 5 లక్షల విదేశీ పుస్తకాలు, 5 వేల నిఘంటువులు ఉన్నాయి. ఒక సామాన్యుడి పట్టుదల ఇప్పుడు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని పొందేలా చేసింది. ఆయన కృషి నేటి తరానికి ఎంతో స్ఫూర్తి.
News January 27, 2026
సీరియల్ నటి భర్తపై కత్తితో దాడి!

కన్నడ సీరియల్ నటి కావ్య గౌడ భర్త సోమశేఖర్ కత్తి గాయాలతో ఆస్పత్రిలో చేరారు. తమ కుటుంబసభ్యులే ఈ దాడికి పాల్పడినట్లు నటి ఆరోపించారు. కావ్య గౌడ సోదరి భవ్య గౌడ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో సోమశేఖర్‌పై సోదరుడు, బంధువులే దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ‘అక్కమొగుడు’ సీరియల్‌తో ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.
News January 27, 2026
అఫ్గాన్‌లో వర్ణ వ్యవస్థ.. 4 తరగతులుగా ప్రజల విభజన!

తాలిబన్ల పాలనలోని అఫ్గాన్‌లో కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వివాదాస్పదమైంది. ప్రజలను 4 తరగతులుగా విభజించడమే ఇందుకు కారణం. ఈ వర్ణ వ్యవస్థలో స్కాలర్లు(ముల్లాలు), ఎలైట్(పాలకులు), మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఉంటారు. ముల్లాలు తప్పు చేసినా శిక్షలుండవు. ఎలైట్ వ్యక్తులకు నోటీసు, సూచన ఇస్తారు. మిడిల్ క్లాస్‌కు జైలుశిక్ష, లోయర్ క్లాస్‌కు జైలుతోపాటు శారీరక శిక్ష విధిస్తారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.


