News October 3, 2024

సీఎం రేవంత్‌పై ఆరోపణలు.. కేటీఆర్‌పై ఫిర్యాదు

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై TPCC మీడియా, కమ్యూనికేషన్స్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్ఠానంపై KTR తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ₹1,50,000 కోట్లను ప్రకటించారని, ఇందులో ₹25,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచిపెట్టేందుకేనని KTR ఆరోపించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 3, 2024

లడ్డూ వివాదంపై నేడు సుప్రీం విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ను కొనసాగించాలా?లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా? అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్నిబట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. గత విచారణలో సీఎం చంద్రబాబుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News October 3, 2024

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా అల్లుడి హతం

image

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ హతమైనట్లు ఐడీఎఫ్ తెలిపింది. సిరియా డమాస్కస్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయగా మరొకరితోపాటు ఖాసిర్ కూడా మరణించారు. మరోవైపు తాజాగా లెబనాన్‌లోని దహియేపై ఇజ్రాయెల్ మూడు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆరుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

News October 3, 2024

భారత్‌లోనే ఖో ఖో తొలి వరల్డ్ కప్

image

మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. ఇందులో 24 దేశాల నుంచి 16 పురుష, 16 మహిళల జట్లు పాల్గొననున్నాయి. ఖో ఖోకు భారత్ పుట్టినిల్లు అని, ఈ వరల్డ్ కప్ దాని ఔన్నత్యాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని హైలైట్ చేస్తుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) తెలిపింది. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ స్పోర్ట్‌గా చూడటం తమ కల అని, అందుకు ఈ ప్రపంచకప్ దోహదం చేస్తుందని పేర్కొంది.