News July 31, 2024
30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ ఆరోపణలు అబద్ధం: YCP

AP: రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయమైనట్లు పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసిందని వైసీపీ ట్వీట్ చేసింది. 2019 నుంచి 2023 వరకు 44,685 మిస్సింగ్ ఫిర్యాదులు రాగా, 44,022 మందిని ట్రేస్ చేసినట్లు లోక్సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని పేర్కొంది. ‘దీనిపై తప్పుడు ప్రచారాలు చేసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?’ అని ప్రశ్నించింది.
Similar News
News November 7, 2025
విడుదలకు సిద్ధమవుతున్న వరి రకాలు

☛ M.T.U.1282: దీని పంటకాలం 120-125 రోజులు. మధ్యస్త సన్నగింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువ. దిగుబడి ఎకరాకు 2.8-3టన్నులు.
☛ M.T.U.1290: పంటకాలం 117-120 రోజులు. సన్నగింజ రకం. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చౌడునేలలకు అత్యంత అనుకూలం. సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు నేలల్లో ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎగుమతులకు అనుకూలం.
News November 7, 2025
అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
News November 7, 2025
రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.


