News October 29, 2024
అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.
Similar News
News December 12, 2025
‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్

‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మ.1.15 గంటలకు దీనిపై విచారణ జరగనుంది. నిన్న సినిమా టికెట్ల పెంపుపై పిటిషన్ను విచారించిన కోర్టు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను రద్దు చేసింది.
News December 12, 2025
రెండో విడతలోనూ పై‘చేయి’కి కసరత్తు

TG: నిన్న ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. 2,200+ స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ 1,100+, బీజేపీ 180+ స్థానాల్లో విజయం సాధించారు. తొలి విడతలో చూపిన జోరునే ఈ నెల 14న జరిగే రెండో విడత పోలింగ్లోనూ కొనసాగించాలని హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. 4,332 పంచాయతీలు, 38,322 వార్డులకు ఆ రోజు ఎన్నికలు జరగనున్నాయి.
News December 12, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీలో 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in


