News April 19, 2024
డబ్బుల కోసమే లైంగిక ఆరోపణలు: నటుడి భార్య

నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ తన భర్త అని చెప్పుకుంటున్న <<13064583>>అపర్ణ<<>> ఠాకూర్ అనే మహిళపై ఎంపీ భార్య ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రవికిషన్ నుంచి రూ.20 కోట్లు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు రేప్ కేసుతో తన భర్తను బెదిరిస్తోందని తెలిపారు. ఆమె ఫిర్యాదుతో అపర్ణ, ఆమె కూతురు షెనోవా, కుమారుడు సోనక్, భర్త రాజేశ్‌పై కేసు నమోదైంది.
Similar News
News February 22, 2026
పాకిస్థాన్ ఖాతాలో అవాంఛిత రికార్డు

T20WC సూపర్-8లో భాగంగా నిన్న న్యూజిలాండ్vsపాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక T20I మ్యాచ్‌లు(7) రద్దయిన జట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐర్లాండ్(6), న్యూజిలాండ్(6), ఇండియా(4), నెదర్లాండ్స్(4) ఉన్నాయి. నిన్న మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
News February 22, 2026
కరెంటు సమస్యలా? ఈ నంబర్‌కు HI అని మెసేజ్ చేయండి

TGSPDCL వాట్సాప్ చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. 8712441912 నంబర్‌కు HI అని మెసేజ్ చేసి పలు సర్వీసులను పొందవచ్చు. కంప్లైంట్స్ రిజిస్టర్, కంప్లైంట్ ట్రాక్, బిల్ వివరాలు, పవర్ సప్లై స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సమస్యపై ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు. 24/7 ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
#ShareIt
News February 22, 2026
భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం MOU

AP: భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, CM CBN సమక్షంలో MOU జరిగింది. MOUపై భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ అందించే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు CM వెల్లడించారు. రాష్ట్రంలోని 13,426 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.


