News November 13, 2024

అమృత్ టెండర్లపై ఆరోపణలు అవాస్తవం: రేవంత్

image

TG: అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ BRS చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని CM రేవంత్ అన్నారు. ‘రెడ్డి పేరు ఉన్న వాళ్లంతా నా బంధువులు కారు. సృజన్ రెడ్డి BRS మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు. ఆ పార్టీ హయాంలోనే సృజన్‌కు రూ.వేల కోట్ల పనులు ఇచ్చారు. ఈ టెండర్లలో అవినీతి జరగలేదని ఉపేందరే చెప్పారు. కేటీఆర్ ఎవరికైనా చెప్పుకోవచ్చు, కేసులు వేసుకోవచ్చు. నాకు ఇబ్బంది లేదు’ అని తెలిపారు.

Similar News

News November 14, 2024

DEC 31 వరకు కాళేశ్వరం కమిషన్ గడువు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం DEC 31 వరకు పొడిగించింది. ఆలోగా నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులను విచారించింది. ఈ నెలలో ఐఏఎస్‌లను, ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉంది.

News November 14, 2024

నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసి గబ్బర్డ్‌

image

డెమొక్రటిక్ మాజీ నేత తులసి గబ్బర్డ్‌ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. డెమొక్రటిక్ విధానాలతో విభేదించిన గబ్బర్డ్‌ 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఆమె గొప్ప స్ఫూర్తిని తీసుకురాగలరని ట్రంప్ కొనియాడారు.

News November 14, 2024

14,000 మంది విద్యార్థులతో విద్యా దినోత్సవం

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు విద్యార్థులతో విద్యా దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది. నేడు HYDలోని LB స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 14,000 మంది విద్యార్థులు పాల్గొంటారు. కాగా SCERT కార్యాలయంలో నిర్వహించే ‘మాక్ అసెంబ్లీ’కి CM రేవంత్ హాజరవుతారు.