News December 10, 2024

EVMలపై ఆరోపణలు.. EC క్లారిటీ

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈవీఎంల దుర్వినియోగం జ‌రిగింద‌ని విప‌క్షాలు చేస్తున్న ఆరోణ‌ల‌కు ఎన్నిక‌ల సంఘం చెక్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 288 నియోజ‌క‌వ‌ర్గాల్లో 1,445 వీవీప్యాట్‌ల‌ను ఆయా ఈవీఎంల‌లో పోలైన ఓట్ల‌తో క్రాస్ చెక్ చేయ‌గా ఎలాంటి వ్య‌త్యాసం క‌న‌పించలేద‌ని స్ప‌ష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ప్ర‌తి స్థానంలో ఐదు చొప్పునా వీవీప్యాట్‌ల‌ను లెక్కించినట్లు తెలిపింది.

Similar News

News November 19, 2025

ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలి: రాఘవరెడ్డి

image

జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకంపై అధికారులతో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆయిల్ ఫాం పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని, ఉదయం 7 గంటలకే ఫీల్డ్ ఆఫీసర్స్ ఫీల్డ్‌లో ఉండాలని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాఘవరెడ్డి అన్నారు.

News November 19, 2025

X(ట్విటర్) డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT

News November 19, 2025

చలికి చర్మం పగులుతుందా?

image

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.