News April 12, 2025
గ్రూప్-1 ఫలితాలపై ఆరోపణలు.. BRS నేతకు TGPSC నోటీసులు

TG: గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని <<15989891>>ఆరోపించిన<<>> బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఎటువంటి ఆరోపణలు చేయవద్దని సూచించింది.
Similar News
News December 5, 2025
డేంజర్లో శ్రీశైలం డ్యాం!

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ భద్రత ప్రమాదంలో ఉందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ రంధ్రం డ్యామ్ పునాదుల కంటే ఎక్కువ లోతుకు విస్తరించిందని అండర్ వాటర్ పరిశీలనలో తేలింది. ఈ రంధ్రం 35–45 మీటర్ల లోతు, 150 మీటర్ల వెడల్పు ఉందని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని కమిటీ సూచించింది.
News December 5, 2025
VIRAL: ఫ్లైట్స్ క్యాన్సిల్.. లగేజీ కోసం తిప్పలు!

400కు పైగా ఇండిగో విమానాలు రద్దవడంతో బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. తిరిగి ఇంటికెళ్లాల్సిన ప్రయాణీకులు తమ లగేజీ ఎక్కడుందో వెతుక్కునేందుకు ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో బ్యాగులు ఒకేచోట ఉంచడంతో తమ వస్తువుల జాడ కోసం ప్రయాణీకుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎయిర్లైన్స్ యాజమాన్యంపై కొందరు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
News December 5, 2025
వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: సీఎం చంద్రబాబు

AP: పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని CM చంద్రబాబు ఉపాధ్యాయులు, పేరెంట్స్కు చెప్పారు. పార్వతీపురం మన్యం(D) భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో CM పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.


