News August 29, 2024
ఐపీఎస్‌లపై ఆరోపణలు.. డీజీపీతో చర్చిస్తాం: CP

APలో సంచలనంగా మారిన <<13964003>>నటిపై<<>> కేసుకు సంబంధించి విజయవాడ సీపీ రాజశేఖర బాబు స్పందించారు. ‘ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నాం. ఈ కేసులో ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. దీనిపై డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని సీపీ తెలిపారు.
Similar News
News January 8, 2026
రూ.26.30 కోట్ల ఫ్లాట్ కొన్న రోహిత్ భార్య

రోహిత్ శర్మ భార్య రితికా ముంబైలోని ప్రభాదేవీ ప్రాంతంలో రూ.26.30 కోట్ల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 2,760sq ft. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.31 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30వేలు చెల్లించారు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ దంపతులు నివాసం ఉంటున్న లగ్జరీ అహూజా టవర్స్‌లోనే ఈ ఫ్లాట్ ఉంది. రోహిత్ దంపతులు కొన్నేళ్లుగా రియల్ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.
News January 8, 2026
ఒత్తిడి పెరిగితే అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.
News January 8, 2026
వాట్సాప్ కొత్త ఫీచర్లు: మెంబర్ ట్యాగ్స్, టెక్స్ట్ స్టిక్కర్స్

వాట్సాప్ మరో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇకపై గ్రూప్ చాట్స్‌లో ఎవరి పాత్ర ఏంటో తెలిపేలా ‘మెంబర్ ట్యాగ్స్’ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక గ్రూప్‌లో ‘కెప్టెన్’ అని, మరో గ్రూప్‌లో ‘అమ్మ’ అని ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఏ పదాన్నైనా తక్షణమే స్టిక్కర్‌గా మార్చే ‘టెక్స్ట్ స్టిక్కర్స్’, ముఖ్యమైన మీటింగ్స్ లేదా పార్టీలను గుర్తు చేసేలా ‘ఈవెంట్ రిమైండర్స్’ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.


