News June 4, 2024

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూటమి హవా

image

➣సత్తెనపల్లిలో మంత్రి అంబటి వెనుకంజ ➣పెదకూరపాడులో TDP అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 1500 ఓట్ల ఆధిక్యం ➣తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ 7885 ఓట్ల ఆధిక్యం ➣బాపట్లలో TDP అభ్యర్థి నరేంద్ర వర్మ 1394 ఓట్ల ఆధిక్యం ➣మైలవరంలో TDP అభ్యర్థి వసంత 1034 ఓట్ల ఆధిక్యం ➣విజయవాడ వెస్ట్‌లో BJP అభ్యర్థి సుజనా చౌదరి 2వేల ఓట్ల ఆధిక్యం ➣పెడన, నందిగామ అసెంబ్లీ, గుంటూరు, బాపట్ల MP స్థానాల్లో TDP ఆధిక్యం

Similar News

News November 21, 2025

DoPTకి లేఖ రాసిన ACB

image

ఫార్ములా eరేస్ కేసు దర్యాప్తులో ACB స్పీడ్ పెంచింది. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి DoPT (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అనుమతి కోరింది. కేంద్ర సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అరవింద్‌ను విచారించి ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. IASలను విచారించాలంటే DoPT పర్మిషన్ ఉండాలి. అటు A1 KTRను విచారించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతించడం తెలిసిందే.

News November 21, 2025

నీటి నిల్వ, సంరక్షణ చర్యలను మెచ్చిన కేంద్రం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా డి.సీఎం పవన్ నేతృత్వంలో నీటి నిల్వ, సంరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు జల్ శక్తి అవార్డులు వరించాయి. పంచాయతీ క్యాటగిరీలో ప్రథమ స్థానంలో మదనపల్లి మండలం, దుబ్బిగానిపల్లె, ద్వితీయ స్థానంలో ప్రకాశం(జి), పీసీ పల్లె(మం) మురుగమ్మి గ్రామం, జల్ సంచయ్-జన్ భాగీదారీలో దక్షిణ జోన్‌లో నెల్లూరు జిల్లాకు అవార్డు దక్కింది.

News November 21, 2025

బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.