News May 8, 2024
మూడో ఫేజ్‌లో కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయింది: మోదీ

TG: వేములవాడ సభలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఇండియా కూటమికి పరాభవమే ఎదురైంది. మూడో ఫేజ్‌లో వారి ఫ్యూజ్ ఎగిరిపోయింది. మిగిలిన 4 విడతల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైంది’ అని మోదీ తెలిపారు.
Similar News
News January 26, 2026
మంచు మనోజ్ భయంకరమైన లుక్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భయంకరమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నాలోని సరికొత్త కోణం. క్రూరమైన, క్షమించలేని’ అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాకు హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ విడుదల కానుంది.
News January 26, 2026
యాసిడ్ దాడి నుంచి పద్మశ్రీ వరకూ!

కేంద్రం ప్రకటించిన ‘పద్మశ్రీ’ అవార్డుల జాబితాలో యాసిడ్ దాడి బాధితురాలు ప్రొఫెసర్ మంగళ కపూర్(UP) కూడా ఉన్నారు. 12 ఏళ్లకే యాసిడ్ దాడికి గురై 37 సర్జరీలు చేయించుకున్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. సంగీతాన్నే శ్వాసగా మార్చుకుని PhD సాధించి 3 దశాబ్దాలుగా విద్యాబోధన చేస్తున్నారు. గ్వాలియర్ ఘరానా శాస్త్రీయ సంగీతంలో ఆమె చేసిన కృషి అద్వితీయం. గాయాల నుంచి గెలుపు వైపు సాగిన ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.
News January 26, 2026
పనిమనిషిపై పదేళ్లుగా రేప్.. ధురంధర్ నటుడి అరెస్ట్

బాలీవుడ్ యాక్టర్ నదీమ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై 10సం.లుగా రేప్‌కు పాల్పడ్డారని అతడి ఇంటి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక, మానసిక వేధింపులకు గురైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇంతకాలం బయటకు చెప్పలేదని పేర్కొంది. దీంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. మిమి, వాధ్, మై లడేగా తదితర మూవీల్లో నటించిన అతడు ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా వంటమనిషి అఖ్లాక్‌గా నటించారు.


