News September 28, 2024

కూటమి నేతలు పాపపరిహారం చేసుకోవాలి: సజ్జల

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఘోరమైన ఆరోపణలు చేసిన కూటమి నేతలు పాపపరిహారం చేసుకోవాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. డిక్లరేషన్ అనేది టీటీడీ, భక్తుడికి సంబంధించిన అంశమని చెప్పారు. ‘జగన్ తిరుమల వెళ్తానంటే దానిని రాజకీయం చేశారు. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు? గతంలో జగన్ పలుమార్లు తిరుమల వెళ్లినా అడగలేదు. మతం వ్యక్తిగతం అని సీఎం చంద్రబాబుకు తెలియదా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News November 20, 2025

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

image

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.

News November 20, 2025

హిందీ Vs మరాఠీ వివాదం.. యువకుడు ఆత్మహత్య

image

హిందీ-మరాఠీ <<15354535>>వివాదం<<>> ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. MHలోని థానేకు చెందిన అర్ణవ్ ములంద్‌లోని కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఈక్రమంలోనే రైలులో హిందీ-మరాఠీపై చర్చ జరిగింది. ఇది కాస్తా గొడవకు దారి తీయడంతో ఐదుగురు యువకుల గ్యాంగ్ అర్ణవ్‌పై దాడి చేసింది. దీంతో అతడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అర్ణవ్ తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

News November 20, 2025

రెండో టెస్టుకు భారత జట్టులో మార్పులివేనా?

image

గువాహటిలో ఎల్లుండి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు భారత జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. గిల్ స్థానంలో సాయి సుదర్శన్, పిచ్ కండిషన్‌ను బట్టి అక్షర్ పటేల్ ప్లేస్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఒకవేళ సాయి సుదర్శన్‌ను తీసుకోకపోతే దేవదత్ పడిక్కల్‌కు అవకాశం ఇస్తారని సమాచారం. ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి.