News June 4, 2024

ఆళ్లగడ్డ, జమ్మలమడుగులో కూటమి విజయం

image

రాయలసీమలోని ఆళ్లగడ్డ, జమ్మలమడుగులో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచారు.

Similar News

News November 13, 2025

నానబెట్టిన మెంతులు మంచివేనా?

image

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

News November 13, 2025

టుడే..

image

* ఢిల్లీలో ఇండో-యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశం
* AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత యూపీఎస్సీ కోచింగ్.. నేటి నుంచి 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
* రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్

News November 13, 2025

పాల వ్యాపారం.. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం

image

పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్. ఆమె 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్‌లో 230 ఆవులు, బర్రెలున్నాయి. మెషిన్లతో పాలను తీస్తూ రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. ఇలా 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలను అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీ క్లిక్ చేయండి.