News November 18, 2024
అన్నాడీఎంకేతో పొత్తు.. ఛాన్సే లేదన్న టీవీకే

అన్నాడీఎంకేతో పొత్తు వార్తలను దళపతి విజయ్ TVK పార్టీ ఖండించింది. ఓ తమిళ పత్రికలో ప్రచురితమైన కథనాలు పూర్తి నిరాధారమైనవని పేర్కొంది. TVKను అడ్డుకొనేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. TNలో DMK తమ ప్రధాన ప్రత్యర్థి అని, BJP తమ సైద్ధాంతిక విరోధి అని గతంలో విజయ్ వ్యాఖ్యానించారు. అయితే ఇరు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోకపోవడంతో పొత్తు ప్రచారం ప్రారంభమైంది.
Similar News
News December 8, 2025
డెలివరీ తర్వాత జరిగే హార్మోన్ల మార్పులివే..!

ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. డెలివరీ అయిన వెంటనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. దీంతో మొదటి 2 వారాల్లో చిరాకు, ఆందోళన, లోన్లీనెస్, డిప్రెషన్ వస్తాయి. అలాగే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉండటంతో యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటివి జరుగుతాయి. దీంతో పాటు స్ట్రెస్ హార్మోన్, థైరాయిడ్ డిస్ఫంక్షన్ వంటివి కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
News December 8, 2025
CHROME వాడుతున్నారా?.. యాపిల్ హెచ్చరిక

గూగుల్ క్రోమ్ వాడే ఐఫోన్ యూజర్లను యాపిల్ సంస్థ హెచ్చరించింది. Chrome బ్రౌజర్ ‘డివైజ్ ఫింగర్ప్రింటింగ్’ అనే రహస్య ట్రాకింగ్ పద్ధతి ద్వారా యూజర్ల కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని పేర్కొంది. దీనిని ఆఫ్ చేసే అవకాశం యూజర్లకు లేదని తెలిపింది. అలాగే Safariలో ‘Try App’ లింక్లను నొక్కితే Google App ఓపెన్ అవుతోందని తద్వారా మరింత డేటాను సేకరిస్తుందని అభిప్రాయపడింది. Safari బ్రౌజర్ సేఫ్ అని స్పష్టం చేసింది.
News December 8, 2025
పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.


