News May 4, 2024
ఏపీలో కూటమిదే విజయం: BJP MP లక్ష్మణ్

ఏపీ, తెలంగాణలో అవినీతి పార్టీల పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ప.గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ బీసీలను బానిసలుగా చేసి పాలన సాగిస్తున్నారు. ఈసారి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి గెలుపు ఖాయం. కేంద్రంలో ప్రధాని మోదీకి సరితూగే నాయకుడు విపక్షాల్లో ఒక్కరూ లేరు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమి తప్పదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
మెస్సీ ఈవెంట్తో సంబంధం లేదు: ఫుట్బాల్ ఫెడరేషన్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్కతా స్టేడియంలో జరిగిన ఘటనపై ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్(AIFF) స్పందించింది. ‘అది PR ఏజెన్సీ నిర్వహించిన ప్రైవేటు ఈవెంట్. ఈ కార్యక్రమం నిర్వహణ, ప్లాన్, అమలు విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫెడరేషన్ నుంచి అనుమతి కోరలేదు’ అని స్పష్టం చేసింది. మరోవైపు మెస్సీ రావడం, ప్రేక్షకులకు చేతులు ఊపడం వరకే ప్లాన్లో ఉందని బెంగాల్ DGP రాజీవ్ కుమార్ తెలిపారు.
News December 13, 2025
గర్భాశయం ఉంటేనే మహిళ: మస్క్

హ్యూమన్ జెండర్పై ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘మీకు గర్భాశయం ఉంటే మీరు మహిళ అవుతారు. లేదంటే కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన మొదటి నుంచి హ్యూమన్ జెండర్ విషయంలో ఈ తరహాలోనే స్పందిస్తున్న విషయం తెలిసిందే. ‘మనుషుల్లో స్త్రీ, పురుషులు మాత్రమే ఉంటారు’ అని చెప్తూ ఉంటారు. LGBT వర్గాలను ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.
News December 13, 2025
సాదా బైనామాలకు అఫిడవిట్లు తప్పనిసరి

TG: సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుతోపాటు అఫిడవిట్లు దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూ హక్కులపై వివాదాల దృష్ట్యా అఫిడవిట్లు ఉంటేనే అనుమతిస్తున్నారు. వివాదాలు తలెత్తినప్పుడు భూ హక్కులకోసం ఇచ్చే దరఖాస్తుల ధ్రువీకరణ నిలిపివేయాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 9.26 లక్షల దరఖాస్తులు రాగా వివాదాల వల్ల 10 శాతం ధ్రువీకరణా పూర్తికాలేదు.


