News July 30, 2024
రెండు రాష్ట్రాలకే నిధుల కేటాయింపు అవాస్తవం: నిర్మల

కేంద్రం తాజా బడ్జెట్లో బిహార్, APలకే అధిక నిధులు కేటాయించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2009-10 బడ్జెట్లో 26 రాష్ట్రాలను ప్రస్తావించలేదన్నారు. 2010-11లో 19 రాష్ట్రాలు, 2011-12లో 15, 2012-13లో 16, 2013-14లో 10 రాష్ట్రాలను విస్మరించడంపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
Similar News
News December 11, 2025
ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు.. ప్రకటించిన CEC

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు CEC నజీర్ ఉద్దీన్ ఇవాళ ప్రకటించారు. ‘డిసెంబర్ 29న నామినేషన్లు, జనవరి 22 నుంచి పోలింగ్‌కు 48గంటల ముందు వరకు ప్రచారానికి అవకాశం ఉంటుంది. 300 పార్లమెంటరీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ రోజే ‘జులై చార్టర్’పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పోలింగ్ నిర్వహిస్తాం’ అని మీడియాకు తెలిపారు.
News December 11, 2025
తడబడుతున్న భారత్

SAతో జరుగుతున్న రెండో T20లో పరిస్థితులు భారత్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో IND తడబడుతోంది. 32 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో 4 రన్స్ చేసిన వైస్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యారు. దూకుడుగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ(17) ఔటవ్వగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5) మరోసారి నిరాశ పరిచారు. SA బౌలింగ్‌లో జాన్సెన్ 2, ఎంగిడి ఒక వికెట్ తీశారు.
News December 11, 2025
హోరాహోరీ.. 3 ఓట్లతో విజయం

TG: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. కొందరు స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సొంతం చేసుకుంటున్నారు. రంగారెడ్డి(D) ఫరూక్నగర్ మండలం శేరిగూడలో కొండం శారద శంకర్‌గౌడ్ 3 ఓట్లతో గెలుపొందారు. అటు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో అన్నాచెల్లెళ్లు బరిలో నిలవగా చెల్లెలు స్రవంతి ఘన విజయం సాధించారు.


