News July 10, 2024
BPCLకు అవసరమైన స్థలం కేటాయిస్తాం: CM

APలో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుపై BPCL ఛైర్మన్ కృష్ణకుమార్, ప్రతినిధులతో CM చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ వనరులున్నాయని ఈ సందర్భంగా CM అన్నారు. రూ.60-70వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న కంపెనీకి 5వేల ఎకరాలు అవసరమని సంస్థ ప్రతినిధులు ఆయన దృష్టికి తెచ్చారు. 90 రోజుల్లో ప్రాజెక్టుపై పూర్తి నివేదిక రూపొందించాలని, ఇబ్బందులు లేకుండా అవసరమైన స్థలం కేటాయిస్తామని CM హామీ ఇచ్చారు.
Similar News
News January 31, 2026
పెరుగుట విరుగుట కొరకే!

‘పెరుగుట విరుగుట కొరకే’ అనేది సుమతీ శతకంలోని ఓ ప్రసిద్ధ పద్యం. ప్రస్తుతం బంగారం, వెండి ధరలకు ఇది అతికినట్టే సరిపోతుంది. ఇటీవల ప్రతిరోజూ ఆకాశమే హద్దుగా రూ.వేలల్లో పెరుగుతూ వచ్చిన వీటి ధరలు నిన్నటి నుంచి నేలచూపులు చూస్తున్నాయి. వెండి కేజీపై రెండ్రోజుల్లో రూ.75వేలు, 10గ్రాముల బంగారంపై దాదాపు రూ.20వేలు తగ్గాయి. త్వరలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటంతో సామాన్య ప్రజానీకానికి తగ్గిన ధరలు ఊరటనిస్తున్నాయి.
News January 31, 2026
తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియాలో పోస్టులు

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)లో 100 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ITI, BE, BTech, BBA అర్హతగల వారు www.apprenticeshipindia.org పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: https://thdc.co.in
News January 31, 2026
రెండు రోజుల్లో రూ.75వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఒక్కరోజే రూ.55వేలు పతనమై రూ.3,50,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.75వేలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనిచ్చింది. అలాగే రెండు రోజుల్లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.18,270 క్షీణించగా 22 క్యారెట్ల 10gల గోల్డ్ రేటు రూ.16,750 తగ్గడం విశేషం.


