News March 17, 2024

సామాజిక సమీకరణల దృష్ట్యా సీట్లు కేటాయింపు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ సామాజిక సమీకరణాలకు అనుగుణంగా, పార్టీ సీనియార్టీ ప్రధానంగా సీట్ల కేటాయింపు జరిగింది. సామాజికవర్గాల వారీగా కాపులకు 5, క్షత్రియులకు 3, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, వెలమకు 1, కమ్మకు 1 స్థానం కేటాయించారు. రెండు పార్లమెంట్‌ స్థానాలను బీసీల్లోని యాదవ, శెట్టిజలిజలకు కేటాయించారు.

Similar News

News November 8, 2025

పాలకొల్లు: నీళ్లనుకుని కలుపుమందు తాగి వ్యక్తి మృతి

image

పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పాలూరి రమేశ్ (46) మృతి చెందాడు. ఈ నెల 4న విధులకు వెళ్తూ పొరపాటున మంచినీళ్ల సీసాకు బదులు కలుపుమందు సీసాను తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నీళ్లు అనుకుని దానిని తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

News November 8, 2025

నరసాపురం: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

image

నరసాపురం(M) సీతారామపురంలోని 216 జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సీతారామపురం నార్త్ గ్రామానికి చెందిన వాకా సత్యనారాయణ (72)గా గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 8, 2025

భీమవరం: బ్యాంకుల అధికారులపై కలెక్టర్ అసహనం

image

పీఎం స్వనిధి, వీవర్స్ ముద్ర, ఎస్‌హెచ్‌సి గ్రూపులకు బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం భీమవరం క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎం స్వనిధి కింద నిధులు విడుదలలో కొన్ని బ్యాంకులు తాత్సారం చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వేగవంతంగా రుణాలు అందించాలని సూచించారు.