News October 8, 2025

ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు: మంత్రి

image

AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్‌లో భాగంగా పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. గడువులోగా సంబంధిత తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.

Similar News

News October 8, 2025

ట్రంప్ ఆంక్షలు.. USకు నో చెబుతున్న IND స్టూడెంట్స్!

image

ట్రంప్ తీసుకొస్తున్న కొత్త ఆంక్షలతో US వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు UK, కెనడా, AUS, జర్మనీ వంటి దేశాల వైపు చూస్తున్నారు. దీంతో USకు వెళ్లే IND స్టూడెంట్స్ సంఖ్య భారీగా తగ్గుతోంది. ట్రేడ్.జీవోవి డేటా ప్రకారం 2024 AUGతో పోలిస్తే ఈ ఏడాది US వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 44% తగ్గింది. వీసాల జారీలో స్ట్రిక్ట్ రూల్స్, లివింగ్ కాస్ట్ పెరుగుదల వంటి అంశాలే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

News October 8, 2025

వాదనలు విన్పించాలని సింఘ్వీకి రేవంత్ విజ్ఞప్తి

image

TG: స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ్టి విచారణ పట్ల కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. కోర్టులో విన్పించాల్సిన వాదనలపై CM <<17942355>>రేవంత్<<>> నిన్న లీగల్ ఎక్స్‌పర్ట్స్, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాదనలు విన్పించాలని పార్టీ సీనియర్ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీని రేవంత్ కోరారు. అటు BC మంత్రులంతా HC దగ్గరే ఉండి పరిణామాలు పరిశీలించాలని CM ఆదేశించారు.

News October 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 29

image

1. వశిష్ట మహాముని భార్య ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది?
3. తిరుమలలో స్వామివారికి నిర్వహించే తొలి సేవ పేరేంటి?
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ఏది?
5. జీవితంలోని పురుషార్థాలు ఎన్ని?
– సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>