News August 22, 2024
ఆఫ్‌లైన్ బుకింగ్ ఉంటేనే అనుమతించండి: CBN

AP: రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్‌లైన్ బుకింగ్ ప్రక్రియ మొదలవనుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు. స్టాక్ పాయింట్లలో ఇసుక ధర, దూరాన్ని బట్టి ఛార్జీలను ప్రకటిస్తారు. ఆఫ్‌లైన్ బుకింగ్ చేసుకున్నవారినే అనుమతించాలని అధికారులను CBN ఆదేశించారు. మరోవైపు వచ్చే నెల 11 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని సీఎంకు అధికారులు తెలిపారు.
Similar News
News January 2, 2026
5 బిల్లులు.. MGNREGAపై స్వల్పకాలిక చర్చ

TG: అసెంబ్లీలో ఇవాళ చేపట్టే బిజినెస్ కార్యక్రమాలను కార్యదర్శి తిరుపతి ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆపై BAC రిపోర్ట్‌ను CM రేవంత్ ప్రవేశపెడతారు. మంత్రి ప్రభాకర్ రవాణా, BC వెల్ఫేర్ గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు సభకు సమర్పిస్తారు. మున్సిపల్, GHMC ACT సవరణ, ప్రైవేటు వర్సిటీలు, మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్ట సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. MGNREGAపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.
News January 2, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 2, 2026
మన మిలిటరీ స్థావరాలపై పాక్ ఫేక్ ప్రచారం!

పాక్ మరోసారి తన నక్క బుద్ధి చూపించింది. ప్రో పాకిస్థాన్ SM అకౌంట్ల ద్వారా ఫేక్ ప్రచారానికి తెరలేపింది. గతేడాది మే నెలలో యుద్ధం సందర్భంగా పంజాబ్‌లోని అమృత్సర్ ఎయిర్‌బేస్, బియాస్‌లోని బ్రహ్మోస్ స్థావరంపై దాడి చేసినట్లు ఆయా అకౌంట్లలో పోస్టులు చేశారు. దాడికి ముందు, తర్వాత అంటూ తప్పుడు చిత్రాలను షేర్ చేశారు. కానీ ఆ నిర్మాణాలు ఎప్పటిలానే ఉన్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా స్వతంత్ర నిపుణులు తేల్చారు.


