News December 18, 2024

శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌‌ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్‌కు వెళ్లిన ఆయన వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న థియేటర్ బయట తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోగా, బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News December 7, 2025

బ్రహ్మసముద్రం: అన్నదమ్ముల మృతిపై అప్‌డేట్..!

image

బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురంలోని నీటి సంపులో పడి అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గానికి చెందిన అన్నదమ్ములు నరేంద్ర (32), చరణ్ (25)పాల వెంకటాపురంలోని మామిడి తోటలోని సంపు వద్దకు వెళ్లారు. చరణ్ కాలుజారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. తమ్ముడిని కాపాడేందుకు అన్న సంపులో దూకాడు. ఇద్దరికి ఈతరాకపోవడంతో ఊపిరాడిక మృతి చెందారు.

News December 7, 2025

రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

image

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్‌లైన్‌లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News December 7, 2025

కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

image

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.