News December 14, 2024

అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరు విడుదల

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేసినట్లు చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వెనుక గేటు నుంచి వారిని బయటకు పంపించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ అందడంతో ఇవాళ ఉదయం 6.45 గంటలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 15, 2025

అందాల రాణి.. ఆర్మీ ఆఫీసర్‌గా..

image

పుణే (MH)కు చెందిన కాశీష్ మెత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. మోడలింగ్, యాక్టింగ్‌లో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్‌లో PhD ఛాన్స్ వచ్చింది. కానీ వీటిని లెక్క చేయకుండా దేశం కోసం ఆర్మీలో చేరాలనుకున్నారు. 2024లో CDS ఎగ్జామ్‌లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD)లో పని చేస్తున్నారు.

News September 15, 2025

భారత రత్నం మోక్షగుండం

image

దేశం గర్వించే ఇంజినీర్లలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ముందు వరుసలో ఉంటారు. 1908లో HYDలో మూసీ పొంగి 15వేల మంది మరణిస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి వరద నివారణకు కృషి చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారి జలాశయాలకు ఆటోమేటిక్‌గా వరద గేట్లు తెరిచే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ విధానమే అమలులో ఉంది. ఆయన సేవలకు భారత రత్నతో సత్కరించిన కేంద్రం ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా నిర్వహిస్తోంది.

News September 15, 2025

కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

image

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.