News March 20, 2024
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు అల్లు అర్జున్ దరఖాస్తు

పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కి వచ్చారు. విదేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. ఫారమ్ 4ఏ సమర్పించడంతో పాటు, లైసెన్స్ అనుమతి కోసం నిర్ణీత రుసుం చెల్లించి ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించారు.
Similar News
News November 14, 2025
పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ

TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్‌లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్‌పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు.
News November 14, 2025
కౌంటింగ్ షురూ..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్‌లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
News November 14, 2025
ఈనెల 17న జాబ్ మేళా

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


