News December 14, 2024
A11గా అల్లు అర్జున్.. A1గా థియేటర్ భాగస్వామి

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా, 8మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో అల్లుఅర్జున్ A11గా ఉండగా, థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి A1గా ఉన్నారు. A3గా థియేటర్ మరో భాగస్వామి సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు A9గా, అప్పర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ చంద్రన్ A10గా పోలీసులు చేర్చారు. అటు చంచల్గూడ జైల్లో ఉన్న అల్లుఅర్జున్ కాసేపట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 25, 2025
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పెగడపల్లిలో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంగళవారం ఆయన మాట్లాడారు. వడ్డీలేని రుణాల పంపిణీ గురించి మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. పలువురు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులున్నారు.
News November 25, 2025
ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఐబొమ్మ రవి దొరికాడు: పోలీసులు

TG: ఐబొమ్మ రవికి కష్టపడి జాబ్ చేయాలన్న ఆలోచన లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ CP శ్రీనివాస్ వెల్లడించారు. ‘టెక్నాలజీ తెలుసు. ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. ఓవర్ కాన్ఫిడెన్స్తోనే రవి దొరికాడు. అతడి భార్య మాకు సమాచారం ఇచ్చిందనేది అవాస్తవం. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.20 కోట్ల వరకు సంపాదించాడు. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకుంటాం’ అని స్పష్టం చేశారు.
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.


